![]() |
.webp)
ఆర్జీవీ ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో ఫేమస్ ఐన సెలబ్రిటీ ఆరియానా. అలాంటి ఆరియానా తన లైఫ్ లో ఎన్నో కష్టాలు అనుభవించిందని చెప్పుకొచ్చింది. అలాగే కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను కూడా చెప్పింది. "నేను ఒక ఛానెల్ లో 7 వేలకు యాంకర్ గా జాయిన్ అయ్యా. ఐతే టైఫాయిడ్ రావడం వలన ఫస్ట్ రెమ్యూనరేషన్ 4 వేలే తీసుకున్నా. లైఫ్ లో ఏమవుతాను అన్నదాన్ని నా లైఫ్ లో నాకు నేను తిండి సంపాదించుకునే భాగ్యాన్ని ఆ దేవుడు కల్పించినందుకు చాల సంతోషంగా ఉంది. నాకు యూనివర్స్ ఎందుకో చాలాసార్లు సపోర్ట్ చేస్తుంది. ఐతే నేను జాయిన్ ఐన ఛానెల్ లో ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయాలన్నారు. ఐతే ఆర్జీవీ లేచి వెళ్ళిపోయాడట, ఆయనకు కోపం వచ్చిందట ఇలా అందరూ అనుకోవడం విన్నా. అప్పుడు ఒకటే అనుకున్న ఆర్జీవిని నేను ఇంటర్వ్యూ చేస్తే లేచి వెళ్లిపోకూడదు ఎలాగైనా ఆయన్ని కూర్చోబెట్టాలి, ఈ అమ్మాయి బాగా మాట్లాడింది అనుకోవాలి అనుకున్నా నా మైండ్ లో. ఒక వన్ ఇయర్ తర్వాత భైరవం మూవీకి సంబంధించి ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి రామానాయుడు స్టూడియోస్ కి రమ్మన్నారు. ఐతే అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి చిన్నపిల్లలా ఉంది నాలెడ్జ్ లేదనుకుంటా సన్నగా ఉంది ఆర్జీవీని డీల్ చేయలేదు అని నన్ను పంపేశారు. ఇంకో సారి కూడా అలాగే జరిగింది.
ఆ రోజు ఎలాగైనా ఆర్జీవీ గారిని ఇంటర్వ్యూ చేయాలనీ వెళ్ళా కానీ ఆయన ఆరోజు లేరు. మూడోసారి అవకాశం వచ్చింది పరిగెత్తుకుంటూ వెళ్ళా ఐతే నువ్వు డీల్ చేయలేవు నీ వల్ల కాదు అని పంపేశారు. మూడు సార్లు రిజెక్షన్ చూసేసరికి నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకు ఈ విషయం గురించి ఇంత స్ట్రెస్ అంటూ నా మైండ్ లోంచి ఆ టాపిక్ నే తీసేసాను. కట్ చేస్తే లాక్ డౌన్ టైములో నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని దుల్కర్ సల్మాన్ గారిని ఇంటర్వ్యూ చేశా. అప్పుడు ఆర్జీవీ గారు ఒక్కరే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ టైంలో కాల్ వచ్చింది. ఆ రోజు ఫుల్ బద్దకంగా ఉన్నా. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే మూడ్ లో ఉన్నా. ఆర్జీవీ ఇంటర్వ్యూ చేయాలి మధ్యాహ్నం అన్నారు. నాకు చేయాలనీ లేదు... కానీ చేసాను. టైంకి రావాలని ఉంది అలా ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ వచ్చింది. తర్వాత బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చింది. నాకు గుర్తింపు వచ్చింది. యూనివర్స్ నాకు బాగా సపోర్ట్ చేసింది." అని చెప్పుకొచ్చింది ఆరియానా.
![]() |